సౌదీలో కవలలను విజయవంతంగా వేరు చేసిన వైద్య బృందం

- January 08, 2023 , by Maagulf
సౌదీలో కవలలను విజయవంతంగా వేరు చేసిన వైద్య బృందం

రియాద్: 28 మంది వైద్యులు, నిపుణులు, నర్సులు, ఇతర వైద్య నిపుణులతో కూడిన వైద్య బృందం సౌదీ అరేబియాలో కలిసిపోయి పుట్టిన కవలలను విజయవంతంగా వేరు చేసింది. దాదాపు ఏడు గంటలపాటు నిర్వహించిన ఆపరేషన్  ఏడు దశలుగా సాగింది. కవల పిల్లలు ఒకే వెన్నుపామును పంచుకొని పుట్టారు. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు గురువారం రియాద్‌లో శస్త్రచికిత్స జరిగింది. రాయల్ కోర్ట్ సలహాదారు, కింగ్ సల్మాన్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ అండ్ రిలీఫ్ సెంటర్ (KSrelief) సూపర్‌వైజర్ జనరల్ అయిన డాక్టర్ అబ్దుల్లా అల్ రబీహ్ ఆపరేషన్ విజయవంతం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. గత 32 సంవత్సరాలలో 23 స్నేహపూర్వక దేశాల నుండి 127 కవలల సంరక్షణను సౌదీ అరేబియా చేపట్టిందన్నారు. వైద్య రంగంలో సౌదీ అరేబియా సాధించిన ప్రగతిని ఇది హైలైట్ చేస్తుందన్నారు. ప్రస్తుతం శిశువులు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com