పైలట్ సహా నలుగురు సిబ్బంది పై షోకాజ్ నోటీసులు
- January 08, 2023
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై తాజాగా ఎయిర్ ఇండియా సిఇఒ క్యాంప్‌బెల్ విల్సన్ స్పందించారు. ఘటన జరగడం దురదృష్టకరమని.. ఇందుకు గానూ, క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. మరోవైపు అంతర్జాతీయ విమానాల్లో ఆల్కహాల్ సర్వీస్ విధానాన్ని సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. విమానంలో ఆల్కహాల్ సర్వీస్, సంఘటనల మేనేజ్మెంట్, బోర్డులో ఫిర్యాదుల నిర్వాహణ, నమోదుతోపాటు సిబ్బంది వల్ల ఇతర లోపాలు ఉన్నాయా అనే దానిపై అంతర్గత దర్యాప్తులు వంటి అంశాలపై ఎయిర్‌లైన్ సమీక్ష చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ముంబైకి చెందిన శంకర్ మిశ్రా నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాడు. బిజినెస్ క్లాస్‌లో ట్రావెల్ చేసిన మిశ్రా మద్యం మత్తులో ఒక వద్ధురాలిపై మూత్ర విసర్జన చేసిన విషయం తెలిసిందే. ఈ విషయం ఇటీవల వెలుగులోకి రావడంతో ముంబై పోలీసులు కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో పైలట్, నలుగురు సిబ్బందిపై ఎయిర్ ఇండియా చర్యలు చేపట్టింది. వారికి షోకాజ్ నోటీస్ జారీ చేయడంతోపాటు విధులకు దూరంగా ఉంచి గ్రౌండ్ చేసింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న మిగతా సిబ్బందిపై అంతర్గత దర్యాప్తు జరుపుతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







