చంద్రబాబుతో ముగిసిన పవన్ కళ్యాణ్ భేటీ
- January 08, 2023
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్..టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబు ఇంటికి వెళ్లి బాబు ను పవన్ కలిశారు. ప్రస్తుతం ఏపీలో జీవో 1 ను జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవో ప్రకారం బహిరంగ సమావేశాలు , సభలు , ర్యాలీలకు పలు ఆంక్షలు విధించారు. పార్టీల నేతలు ఏంచేయాలన్న పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందే. వారు ఎక్కడ సభ పెట్టమంటే..అక్కడ పెట్టాలని లేదంటే లేదని ఆంక్షలు విధించారు.
ఈ తరుణంలో చంద్రబాబు కుప్పం పర్యటన ను పోలీసులు అడ్డుకోవడం జరిగింది.ఈ విషయమై పవన్ ఆదివారం చంద్రబాబు ను కలిసినట్లు తెలుస్తుంది. సమావేశం అనంతరం మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కుప్పంలో జరిగిన సంఘటన పై కలిశామని.. వైస్సార్సీపీ అరాచకాలపై మాట్లాడుకున్నామన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు హక్కు అని.. కానీ అడ్డుకుంటున్నారు..ఏపీలో వైస్సార్సీపీ అరాచక పాలన జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. బ్రిటిష్ కాలం నాటి జీవో తెచ్చారని జగన్ తీరు మండిపడ్డారు. వైస్సార్సీపీ తెచ్చినవి.. చెత్త జోవో లు వీటికి బ్రేక్ వేయాలన్నారు పవన్ కళ్యాణ్. వైజాగ్ లో కూడా నన్ను అడ్డుకున్నారని ఆగ్రహించారు.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







