యూఏఈలో నిరుద్యోగ బీమా పరిహారానికి పది షరతులు
- January 11, 2023
యూఏఈ: యూఏఈలో మెజారిటీ కార్మికులు ఇప్పుడు నిరుద్యోగ బీమా ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకోవడానికి అర్హత పొందారు. అయితే పాలసీ ప్రయోజనాలను పొందడానికి కొన్ని కండిషన్లు విధించారు. నిరుద్యోగ బీమా కార్యక్రమాన్ని నియంత్రించే 2022 ఫెడరల్ డిక్రీ-బిల్ నంబర్ 13లోని ఆర్టికల్ 5, చట్టం ఆమోదించబడిన తర్వాత ప్రచురించబడిన 2022 కేబినెట్ రిజల్యూషన్ నంబర్ 97లోని ఆర్టికల్ 9.. ఈ రెండూ బీమా పరిహారం పొందేందుకు కొన్ని నిబంధనలను పొందుపరిచారు. అనివార్య కారణాల వల్ల పని కోల్పోయిన కార్మికుడు మూడు నెలల పాటు వారి ప్రాథమిక జీతంలో 60% శాతాన్ని పొందవచ్చు.
బీమా పొందడానికి ముఖ్యమైన 10 కండిషన్లు
1. నిరుద్యోగ బీమా కార్యక్రమం కోసం సైన్ అప్ చేసిన తర్వాత కనీసం 12 వరుస నెలలు తప్పనిసరిగా కిస్తీలు చెల్లాంచాలి.
2. తప్పనిసరిగా అన్ని బీమా ప్రీమియంలను తగిన వ్యవధిలో చెల్లిస్తున్నారని నిర్ధారించుకోవాలి.
3. రాజీనామా కాకుండా ఇతర కారణాల వల్ల నిరుద్యోగులని చూపించాలి.
4. క్రమశిక్షణా కారణాల వల్ల మీరు మీ పని నుండి తొలగించబడకూడదు.
5. ఉపాధి కోల్పోయిన 30 రోజులలోపు లేదా లేబర్ ఫిర్యాదుపై న్యాయస్థానం తీర్పునిచ్చిన రోజు, ఏది ముందుగా వచ్చినా క్లెయిమ్‌లు తప్పనిసరిగా దాఖలు చేయాలి.
6. పరారీలో ఉన్న యాక్టివ్ రిపోర్ట్‌లో కార్మికుడి పేరు ఉండకూడదు.
7. పరిహారం పొందేందుకు ఎలాంటి మోసపూరిత క్లెయిమ్‌లు చేయకూడదు.
8. మరొక యజమానితో ఉపాధి ఒప్పందం చేసుకున్న సందర్భంలో పరిహారం చెల్లింపు ఆగిపోతుంది.
9. సమ్మెలు లేదా ఇతర హింసాత్మక నిరసనలలో పాల్గొడం ఉద్యోగం కోల్పోయేందుకు కారణాలుగా పరిగణించరు.
10. బీమా చేసిన వ్యక్తి తప్పనిసరిగా దేశంలో రిజిస్టర్డ్ రెసిడెన్సీ కలిగి ఉండాలి.
రెండు వారాల్లో పరిహారం
ఆర్టికల్ 12 ప్రకారం, బీమా పాలసీని రెండు వారాల్లో పరిష్కరించాలి. యూఏఈ సెంట్రల్ బ్యాంక్ లైసెన్స్ పొందిన సర్వీస్ ప్రొవైడర్లు వచ్చిన క్లెయిమ్‌ను స్వీకరించిన రెండు వారాలలోపు బాధితులకు చెల్లింపు చేయాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!
- హైదరాబాద్: భారీ అగ్నిప్రమాదం.. మదీనా క్రాస్‌రోడ్డు బట్టల గోడౌన్లో ఎగసిపడ్డ మంటలు
- ‘అరబ్ హోప్ మేకర్స్’ ఏడో ఎడిషన్ ప్రారంభం.. విజేతకు రూ. కోట్లు విలువైన బహుమతి..!







