అఫ్గానిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి..
- January 12, 2023
కాబుల్: అఫ్గానిస్థాన్‌లో మరోసారి ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో దాదాపు 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అలాగే, దాదాపు 40 మంది తీవ్రగాయాలపాలైనట్లు సమాచారం. అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం వద్ద ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురే మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ, ఓ తాలిబన్ అధికారి మాత్రం.. 20 మంది మృతి చెందారని తెలిపారు.
బాంబుతో విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోకి ప్రవేశించాలని ప్రయత్నించిన ఓ ఉగ్రవాది విఫలమయ్యాడు. దీంతో కార్యాలయం వెలుపలే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడి జరిగిన ప్రాంతంలోనే టర్కీ, చైనాతో పాటు పలు దేశాల దౌత్య కార్యాలయాలు ఉంటాయి. ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఈ ఆత్మాహుతి దాడికి బాధ్యతవహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థా ప్రకటన చేయలేదు. అఫ్గాన్ అధికారులతో ఆ దేశ విదేశాంగ శాఖ కార్యాలయంలో చైనా అధికారులు ఓ సమావేశంలో పాల్గొనాల్సి ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. దాదాపు 40 మంది గాయపడ్డారని ఇటలీకి చెందిన ఓ సంస్థ తెలిపింది.
ఈ దాడిపై కాబూల్ పోలీసులు స్పందిస్తూ దీన్ని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అఫ్గాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ బాంబు దాడులు ఆగడం లేదు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







