ఈ 10 దేశాల్లోని ఎన్నారైలకు.. ఇకపై నగదు చెల్లింపులు
- January 12, 2023
న్యూ ఢిల్లీ: ప్రవాస భారతీయులకు శుభవార్త..! ఇకపై పది దేశాల ఎన్నారైలు డిజిటల్ చెల్లింపులకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) సేవలను పొందవచ్చు. అంటే.. వారు ఉంటున్న దేశం నుంచి.. భారత్‌లోని ఎన్నారై బ్యాంకు ఖాతా ద్వారా నగదు చెల్లింపులు జరపవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, హాంగ్‌కాంగ్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాల్లో ఉంటున్న ఎన్నారైలకు తొలి దశలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని భారత జాతీయ చెల్లింపుల సంస్థ(ఎన్పీసీఐ) వెల్లడించింది. ఆ మేరకు బ్యాంకర్లు ఏప్రిల్ 30లోగా తమ మెకానిజంలో మార్పులు చేసుకోవాలని సూచిస్తూ మంగళవారం ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. అంటే.. ఎన్నారైలు యూపీఐ చెల్లింపులకు అనుమతించేలా ఈ పది దేశాలకు చెందిన కంట్రీకోడ్ ఉన్న మొబైల్ నంబర్లను బ్యాంకర్లు తమ మెకానిజంలో చేర్చాల్సి ఉంటుంది. ఆ వెంటనే ఎన్నారైలు యూపీఏ సేవలను వినియోగించుకునే అవకాశాలుంటాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..