మక్కా గ్రాండ్ మస్జీదుకు ఉచిత షటిల్ సేవలు ప్రారంభం
- January 13, 2023
జెద్దా: జెద్దాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం యాత్రికుల కోసం ఉచిత షటిల్ సేవను ప్రారంభించింది. ఈ కొత్త సర్వీస్ యాత్రికులను విమానాశ్రయంలోని టెర్మినల్ 1 నుండి మక్కాలోని గ్రాండ్ మస్జీదుకు తీసుకువెళుతుందని విమానాశ్రయం ట్విట్టర్లో ప్రకటించింది. "లబ్ధిదారులు తప్పనిసరిగా ఇహ్రామ్ ధరించాలి. సౌదీల కోసం జాతీయ ID లేదా విదేశీయుల పాస్‌పోర్ట్‌ను తప్పనిసరిగా సమర్పించాలి." అని తన ట్వీట్ లో పేర్కొంది. విమానాశ్రయం నుండి ప్రతి రెండు గంటలకు ఒక సర్వీసు ప్రారంభం అవుతుంది. ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల వరకు షటిల్ సర్వీసుల సేవలు అందుబాటులో ఉంటాయి. తిరిగి మధ్యాహ్నం 12 నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు గ్రాండ్ మస్జీదు నుండి షటిల్ సర్వీసులు తిరుగు ప్రయాణం అవుతాయి.
తాజా వార్తలు
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన







