అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం కీలక ప్రకటన
- January 14, 2023
హైదరాబాద్: అమెరికా వీసా కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థుల కోసం ఆన్‌లైన్‌లో ప్రత్యేక సమాచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం తెలిపింది. ఈ నెల 19న సాయంత్రం 3.30-4.30 గంటల మధ్య ‘వర్చువల్ స్టూడెంట్ వీసా ఇన్ఫర్మేషన్ సెషన్’ ఉంటుందని ట్వీట్ చేసింది. ఇది పూర్తిగా ఉచితమని పేర్కొంది. ఇందులో పాల్గొనాలనుకునే విద్యార్థులు 19 జూమ్ లింక్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎఫ్-1 వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు అమెరికన్ కాన్సులేట్ వీసా అధికారి సూచనలు ఇస్తారు. దరఖాస్తు విధానం, ఫీజు వివరాలు, ఇంటర్వ్యూ, వీసా నిబంధనల గురించి వివరిస్తారు. విద్యార్థి వీసాలకు సంబంధించిన సమాచారం మాత్రమే ఈ సెషన్‌లో ఇస్తామని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







