‘వీరయ్య’ ఎంట్రీతో ‘వీరసింహం’ గర్జన మూగబోయిందే.!
- January 14, 2023ఈ ఏడాది సంక్రాంతి సినీ ప్రియులకు ఎక్కడ లేని పండగ తీసుకురాబోతోందనే ఆసక్తి కలిగించింది. చాలా కాలం తర్వాత చిరంజీవి, బాలయ్యలు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగడమే అందుకు కారణం.
‘వీర సింహారెడ్డి’గా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నందమూరి బాలకృష్ణ. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయ్. బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ మీల్స్ లెక్క ఈ సినిమాని పండగ చేసుకున్నారు.
ఒక్క రోజు గ్యాప్‌లో అంటే, జనవరి 13న ‘వాల్తేర్ వీరయ్య’ ఎంట్రీ ఇచ్చాడు. ఖచ్చితంగా రెండు సినిమాలు రిలీజ్ అయినప్పుడు పోలికలు సర్వ సాధారణం. అలా ముందుగా వచ్చిన బాలయ్య సినిమాతో, చిరంజీవి సినిమాని పోల్చుకున్నారు అభిమానులు.
ఎంటర్‌టైన్‌మెంట్, మాస్ కంటెంట్.. ఇలా ‘వీరసింహారెడ్డి’తో పోల్చితే, ‘వీరయ్య’ లో అదనంగా వుండడంతో, ఈ సినిమాకి ఎక్కువ ఆదరణ లభించిందని టాక్ వినిపిస్తోంది. అసలు సిసలు సంక్రాంతి సినిమా ‘వీరయ్య’నే అనీ, సంక్రాంతి హీరో మెగాస్టార్ అనీ సినీ మేధావుల్లో టాక్ వినిపిస్తోంది.
ఏది ఏమైనా సంక్రాంతి సీజన్‌లో ఏ సినిమా అయినా కొట్టుకుపోతుంది. ఇరు హీరోల అభిమానులూ రెండు సినిమాల్నీ అమితంగా ఆదరిస్తున్నారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







