మహిళా కార్మికుల్ని వేధిస్తున్న ముగ్గురి అరెస్ట్‌

- April 28, 2016 , by Maagulf
మహిళా కార్మికుల్ని వేధిస్తున్న ముగ్గురి అరెస్ట్‌

హిద్‌లోని ఓ క్లీనింగ్‌ కంపెనీలో పనిచేస్తున్న మహిళా కార్మికులపై వేధింపులకు పాల్పడుతున్న ముగ్గురు భారత పౌరుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మాల్‌లో క్లీనింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న మహిళల్ని, అందులో ఉద్యోగులుగా పనిచేస్తున్న ముగ్గురు వ్యక్తులు ప్రతిరోజూ వేధింపులకు గురిచేసేవారు. పని వేళల్లోనూ, ఆ తర్వాత తాము నివాసముండే చోట కూడా వేధింపులకు పాల్పడుతున్నారని బాధిత మహిళలు పోలీసులకు తెలిపారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, రెడ్‌ హ్యాండెడ్‌గా ఆ ముగ్గురినీ అరెస్ట్‌ చేశారు. ఇండియాకి చెందిన సామాజిక కార్యకర్తలకు ఈ సమాచారాన్ని చేరవేశారు. వారే పోలీసులకు, ఇండియన్‌ ఎంబసీకి సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com