సింగపూరులో 'సిరిజోత' లఘు చిత్రం ప్రదర్శన

- January 14, 2023 , by Maagulf
సింగపూరులో \'సిరిజోత\' లఘు చిత్రం ప్రదర్శన

 సింగపూరు: శబ్ద కాన్సెప్ట్స్ బ్యానర్ మీద నిర్మించిన లఘు చిత్రం సిరిజోత నిన్న రాత్రి  సింగపూరు ఈగల్ వింగ్స్ సినిమేటిక్స్ లో ప్రదర్శించబడింది.ఈ చిత్రానికి  కథ మాటలు సుబ్బు పాలకుర్తి మరియు కవిత కుందుర్తి అందించారు.సురేష్ రాజ్ దర్శకత్వంలో అభిరాం, విజయ భరత్ పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం యూ ట్యూబ్ మాధ్యమం ద్వారా ఈ రోజు విడుదల అయింది.తెలుగు భాషా ప్రాముఖ్యతను వివరిస్తూ ఆద్యంతం తెలుగు కోసం పాటుపడే పాత్రల సంఘర్షణలతో రూపొందించిన ఈ చిత్రాన్ని సింగపూరు నందు నివశిస్తున్న తెలుగు ప్రముఖులు అందరూ వచ్చి చూసి తమ అభినందనలు తెలియచేసారు అలాగే  తెలుగు భాషాభిమానులందరూ తప్పక చూడవలసిన చిత్రం ఇది అని అభిప్రాయాన్ని వెల్లడించారు. శ్రీ సాంస్కృతిక కళా సారధి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు, కాకతీయ సాంస్కృతిక పరివారం అధ్యక్షులురాంబాబు పాతూరి, సింగపూరు తెలుగు సమాజం పూర్వాధ్యక్షులు రంగ రవి, సింగపూరు పోతన భాగవత ప్రచార సమితి అధ్యక్షులు భాస్కర్ ఊలపల్లి, తాస్ అధ్యక్షులు  అనితా రెడ్డి, అమ్ములు గ్రూపు సభ్యులు సునీత  తదితర ప్రముఖులందరూ వచ్చి తమ చిత్రాన్ని చూసి అభినందించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము అని సింగపూరు నందు వెండి తెర మీద ప్రదర్శించబడిన మొట్టమొదటి  తెలుగు లఘు చిత్రం తమది కావడం..అందులోనూ తెలుగు భాష మీద నిర్మించిన చిత్రం కావడం మరింత ఆనందదాయకమని నిర్మాత సుబ్బు పాలకుర్తి తెలియచేసారు.
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com