2022లో 80వేల యూఏఈ గోల్డెన్ వీసాలు జారీ
- January 14, 2023
యూఏఈ: విదేశీయులకు దీర్ఘకాలిక రెసిడెన్సీ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గోల్డెన్ వీసాలు ఇస్తోంది.5,10 ఏళ్ల పరిమితితో ఈ వీసాలను జారీ చేస్తోంది.వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన వారు, పెట్టుబడిదారులు, ఇతర కేటగిరీల వారికి ఇలా యేటా భారీ సంఖ్యలో గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తోంది. దీనిలో భాగంగా 2022లో 80వేల వరకు వీసాలు మంజూరు చేసింది. ఈ మేరకు తాజాగా దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ వెల్లడించింది.
జీడీఆర్ఎఫ్ఏ (GDRFA) సమాచారం ప్రకారం అన్ని కేటగిరీలకు కలిపి 79,617 గోల్డెన్ వీసాలు జారీ చేసినట్లు పేర్కొంది. అంతకుముందు ఏడాది (2021) ఈ సంఖ్య 47,150 మాత్రమే. అంటే 2022లో దాదాపు రెట్టింపు అయింది. అలాగే గతేడాది డైరెక్టరేట్ మొత్తంగా 62.24 మిలియన్ల ట్రాన్సక్షన్స్ చేసింది. ఇందులో 46,965,715 ఎంట్రీ, ఎగ్జిట్ (వాయు, రోడ్డు, సముద్ర ప్రయాణాలకు సంబంధించినవి) ట్రాన్సక్షన్స్ ఉన్నాయి. అలాగే వీసా (9,852,218 ), రెసిడెన్సీ (4,499,712), ఎలక్ట్రానిక్ పాస్‌పోర్ట్ (40,642), లీగల్ కన్సల్టేషన్స్ (37,267) ట్రాన్సక్షన్స్ ఉన్నాయి. ఇక జీడీఆర్ఎఫ్ఏ దాని కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడంలో 99 శాతం సక్సెస్ రేటును సాధించింది. అలాగే కస్టమర్ హ్యాపీనెస్ ఇండెక్స్ 96 శాతం దాటగా.. భాగస్వామి హ్యాపీనెస్ ఇండెక్స్ 100 శాతానికి చేరుకుంది.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







