జల్లికట్టు పోటీలకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి..
- January 15, 2023
చెన్నై: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకంది. జల్లికట్టు పోటీలకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ అనుమతి ఇవ్వడంతో ఇవాళ జల్లి కట్టు పోటీలు అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. జల్లికట్టుకు మదురై సిద్ధమయింది. మధురై జిల్లాలోని అవనియాపురంలో జల్లికట్టు పోటీలకు ఏర్పాట్లు చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఈ ప్రాంతంలో జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. తొలి జల్లికట్టు క్రీడకు అవనియాపురం సిద్ధమైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా తమిళనాడులోని అవనియాపురం, సాలమేడు, అలంగనూరు ప్రాంతాల్లో ప్రాచీన సాహస క్రీడ జల్లికట్టును నిర్వహిస్తున్నారు.
ఇక అవనియాపురం జల్లికట్టులో ఏళ్ల తరబడి నిర్వహిస్తూ వచ్చిన తెంకాలు సాగునీటి రైతుల సంఘానికి, అవనియాపురం గ్రామ కమిటీకి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడంతో ఈ సారి జల్లికట్లు పోటీలను జిల్లా యంత్రాంగం, పురపాలక సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ పోటీల నిర్వహణకు పురపాలక సంఘం రూ.17 లక్షల టెండర్ ను పిలిచి మరీ ఏర్పాటు చేసింది. వారివాసలు నిర్మించి బారికేడ్లను ఏర్పాటు చేయడం, ప్రేక్షకుల గ్యాలరీ, వెటనరీ పరిశీలన కేంద్రాలు,ఇవాళ జరిగే జల్లికట్టు క్రీడలో 800 ఎద్దులు పాల్గొంటున్నాయి.
వీటిని అణిచివేయడానికి మధురై, శివగంగై, దెండుగల్, తేని తదితర జిల్లాలకు చెందిన 400 మంది సాహస క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిని రౌండ్ల వారిగా జల్లికట్టు మైదానంలోకి అనుమతించనున్నారు. ఎద్దులను అణిచివేసే క్రీడాకారులకు ఎవరికి పట్టు చిక్కకుండా తప్పించుకునే ఎత్తుల యజమానులకు బహుమతులు ప్రధానం చేయనున్నారు.
సైకిళ్లు, బీరువాలు, బంగారు కాసులు తదితర కానులను వీరికి అందిస్తారు. జల్లికట్టుకు సంబంధించి హెల్త్ డిపార్ట్ మెంట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జల్లికట్టులో గాయపడిన వారికి తక్షణం చికిత్స అందించడానికి వైద్య బృందాలు రెడీగా ఉన్నాయి. ఆరు అంబులెన్స్ లను అందుబాటులో ఉంచారు. ఈ పోటీల్లో గొడవలు జరుగకుండా భద్రతా కూడా పెంచారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







