SSMB28 మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్
- January 15, 2023
హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ నాగవంశీ మరో చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘బుట్టబొమ్మ’. శౌరీ చంద్రశేఖర్ టి రమేష్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గోపి సుందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టింది.
ఈ క్రమంలోనే నిర్మాత నాగవంశీ, అనిఖా సురేంద్రన్.. యాంకర్ సుమకు ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో నాగవంశీ SSMB28 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. మహేష్ బాబు గారి సినిమా గురించి ఫ్యాన్స్ కి ఏమన్నా అప్డేట్ ఇవ్వచ్చు కదా అని సుమ అడిగింది. దీనికి బదులిస్తూ.. ‘SSMB28 రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 18 నుంచి మొదలు కానుంది. ఈ ఏడాది ఆగష్టు 11న సినిమాని విడుదల చేస్తాం’ అంటూ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసేశాడు నాగవంశీ.
అలాగే మూవీలో హీరోయిన్స్ గా ఎవరు యాక్ట్ చేస్తున్నారు అనేది కూడా తెలియజేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్దే చేస్తున్న సంగతి తెలిసిందే. మేము ప్రకటించకుండానే సెకండ్ హీరోయిన్ గా ‘శ్రీలీల’ని తీసుకున్నట్లు. మళ్ళీ ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అవి ఏవి నిజం కాదు. ఈ సినిమా కోసం శ్రీలీలని తీసుకున్న సంగతి నిజమే కానీ ఆమె తప్పుకుంది అనేది అబద్ధం. ఈ సినిమాలో ఆమె మరో హీరోయిన్ గా చేస్తున్న సంగతి నిజమే కానీ ఆమె సెకండ్ హీరోయిన్ అనేది అబద్ధం. ఈ మూవీలో ఇద్దరి హీరోయిన్ లకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఫస్ట్, సెకండ్ హీరోయిన్లు అనేది లేదు. ఇద్దరు మహేష్ బాబు పక్కన ఈక్వల్ గా నటిస్తారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







