సంస్కృతి, పర్యాటకం, క్రీడా మౌలిక సదుపాయాలకు మద్దతుగా ఇన్వెస్ట్ మెంట్ ఫండ్
- January 17, 2023
రియాద్: రాజ్యవ్యాప్తంగా సంస్కృతి, పర్యాటకం, వినోదం, క్రీడా రంగాలకు స్థిరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఇన్వెస్ట్ మెంట్ ఫండ్‌ను ప్రారంభించినట్లు ప్రధాన మంత్రి, ఈవెంట్స్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (EIF) ఛైర్మన్, క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. స్థానిక పరిశ్రమలను పెంపొందించడానికి, విదేశీ పెట్టుబడులను పెంచడానికి, విజన్ 2030లో భాగంగా వ్యూహాత్మక భాగస్వామ్యాలను సృష్టించడం కూడా ఈ ఫండ్ లక్ష్యమని తెలిపారు. ఇందులో భాగంగా ఇండోర్ అరేనాలు, ఆర్ట్ గ్యాలరీలు, థియేటర్లు, కాన్ఫరెన్స్ సెంటర్లు, గుర్రపు పందెం ట్రాక్‌లు, ఆటో రేసింగ్ ట్రాక్‌లను కింగ్డమ్ అంతటా విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరచడం, చమురుయేతర GDPలో ఇతర రంగాల వాటాను పెంచడం, అలాగే వార్షిక GDPకి పర్యాటక రంగం సహకారాన్ని 10 శాతానికి(ప్రస్తుత 3 శాతం) కంటే ఎక్కువకు పెంచడం విజన్ 2030కి తాజా ఫండ్ దోహదం చేస్తుందన్నారు. రాజ్యాన్ని గ్లోబల్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా మార్చడానికి మద్దతు ఇస్తుందని, 2030 నాటికి 100 మిలియన్లకు పైగా సందర్శకులను ఆకర్షిస్తుందని, ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే దేశాలలో ఒకటిగా చేస్తుందని క్రౌన్ ప్రిన్స్ వెల్లడించారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







