'సుప్రీమ్' చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు
- April 29, 2016
సాయిధరమ్‌తేజ్, రాశీఖన్నా జంటగా నటించిన 'సుప్రీమ్' చిత్రం మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర నిర్మాత దిల్‌రాజు సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... సరికొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ లభించినట్లు పేర్కొన్నారు.అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. సాయి కార్తీక్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో సాయిధరమ్‌తేజ్ టాక్సీ డ్రైవరుగా, రాశీఖన్నా పోలీసు అధికారిణిగా కనిపించనున్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







