'కత్తి'లాంటోడు చిత్రం ముహుర్తం షాట్ కుటుంబ సభ్యుల సమక్షంలో..
- April 29, 2016
'కత్తి'లాంటోడు అంటూ మెగాస్టార్ చిరంజీవి దూసుకొస్తున్నారు. ఆయన 150వ సినిమా మధ్నాహ్నం 1.30 గంటలకు లాంఛనంగా ప్రారంభమైంది. వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ముహుర్తం షాట్ శుక్రవారం చిరంజీవి కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ క్లాప్ కొట్టగా, అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.విజయ్ తమిళంలో నటించిన కత్తి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. జూన్ మొదటివారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ పాత్రలో మెరిపించనున్నట్లు తెలుస్తోంది.కాగా చిరంజీవి 2007 నుంచి సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఆయన చివరిగా శంకర్ దాదా జిందాబాద్ లో నటించారు. అనంతరం రాజకీయల్లోకి ప్రవేశించి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. అయితే రాజకీయాల్లో అనుకున్నంతగా రాణించలేకపోయిన చిరంజీవి తాను స్థాపించిన పీఆర్పీనీ 2011లో కాంగ్రెస్ లో విలీనం చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి







