తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తాం: సీఎం కేజ్రీవాల్
- January 18, 2023
హైదరాబాద్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కేజ్రీవాల్‌కు ఘన స్వాగతం పలికాయి. కాగా బుధవారం ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ సభ కోసం సీఎం కేసీఆర్ కేజ్రీవాల్‌ను ఆహ్వానించారు. ఇదిలా ఉండగా కేజ్రీవాల్ తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలను, నేతలను కలిశారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల కోసం రాలేదు. కంటి వెలుగు మంచి కార్యక్రమం కాబట్టే ఇక్కడికి వచ్చామన్నారు. తెలంగాణలో ఆప్ నిర్మాణం కోసం కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. పార్టీ బలోపేతానికి కృషిచేయాలన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ







