ఉత్కంఠపోరులో భారత్ విజయం..

- January 18, 2023 , by Maagulf
ఉత్కంఠపోరులో భారత్ విజయం..

హైదరాబాద్: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో భారత్ గెలుపొందింది. ఈ ఉత్కంఠపోరులో 12 పరుగుల తేడాతో కివీస్ ను చిత్తు చేసింది టీమిండియా. భారత్ నిర్దేశించిన 350 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్.. 337 రన్స్ కు ఆలౌట్ అయ్యింది.

130 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న కివీస్ ను.. బ్రేస్ వెల్(140), శాంట్నర్(57) జోడీ గెలిపించేంత పని చేసింది. ముఖ్యంగా మైఖల్ బ్రేస్ వాల్ సెంచరీతో చెలరేగాడు. పరుగుల వరద పారించాడు. బ్రేస్ వెల్ 78 బంతుల్లోనే 140 పరుగులు బాదాడు. అతడి ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయి. క్రీజులో ఉన్నంత సేపు బ్రేస్ వాల్ దడదడలాడించాడు. న్యూజిలాండ్ గెలుస్తుందని అంతా అనుకున్నారు.

కాగా, భారత బౌలర్ సిరాజ్..శాంట్నర్ ను ఔట్ చేశాడు. తర్వాత బ్రేస్ వెల్ పోరాడినా ప్రయోజం లేకపోయింది. కివీస్ కు ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో సిరాజ్ 4 వికెట్లతో చెలరేగాడు. కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ తలో రెండు వికెట్లు తీశారు.మహమ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్ లో భారత బ్యాటర్లలో ఓపెనర్ శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు.గిల్ 149 బంతుల్లో 208 పరుగులు చేశాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com