యూఏఈలో పెరిగిన వీసా, ఎమిరేట్స్ ఐడీ ఖర్చులు!
- January 20, 2023
యూఏఈ: యూఏఈలో పెరిగిన వీసా, ఎమిరేట్స్ ఐడీ ఖర్చులు పెరిగాయి. కొత్తగా ఎమిరేట్స్ ఐడి, వీసాల జారీకి రుసుములు పెరిగాయని ట్రావెల్, టైపింగ్ సెంటర్ ఏజెంట్లు చెబుతున్నారు. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ICP)కి చెందిన ఒక కస్టమర్ కేర్ ఏజెంట్ మాట్లాడుతూ.. వీసా, ఎమిరెట్ ఐడీ ఫీజులు Dh100 పెరిగినట్లు వెల్లడించారు. ఎమిరేట్స్ ID, విజిట్-రెసిడెన్సీ వీసాలకు ఫీజు పెంపు వర్తిస్తుందని ఓ టైపింగ్ సెంటర్ ఏజెంట్ తెలిపారు. ఎమిరేట్స్ ID ఇప్పుడు Dh270కి బదులుగా Dh370 అయిందన్నారు. ఒక నెల సందర్శన వీసా జారీ చేయడానికి రుసుము Dh270కి బదులుగా Dh370 వసూలు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, దుబాయ్ నుండి జారీ చేయబడిన విజిట్ వీసాలలో ఇంకా ఎటువంటి మార్పులు లేవని ప్లూటో ట్రావెల్స్ మేనేజింగ్ పార్టనర్ భరత్ ఐదాసాని తెలిపారు. ICP ఇటీవల దేశంలో ఎక్కువ కాలం గడిపిన వీసాలపై జరిమానాను 50 దిర్హామ్‌లుగా నిర్ణయించింది. దీంతో టూరిస్ట్, విజిట్ వీసా హోల్డర్లు ఎక్కువ కాలం బస చేసేవారు 100 దిర్హామ్‌లకు బదులుగా రోజుకు 50 దిర్హామ్‌లు చెల్లించాలి. అలాగే రెసిడెన్సీ వీసాపై ఎక్కువ కాలం ఉంటున్న వారు రోజుకు 25 దిర్హామ్‌లకు బదులుగా రెట్టింపు 50 దిర్హామ్‌లు చెల్లించాల్సి ఉంటుంది. గత సంవత్సరం యూఏఈలో ఎంట్రీ, రెసిడెన్సీ సంస్కరణలు అమలులోకి వచ్చాయి. గోల్డెన్ వీసా స్కీమ్, కొత్త ఐదేళ్ల గ్రీన్ రెసిడెన్సీ, మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా, జాబ్ హంటింగ్ ఎంట్రీ పర్మిట్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- BITS పిలానీ–డైమ్లర్ ట్రక్ ఇన్నోవేషన్ సెంటర్ భాగస్వామ్యం
- అల్ అమరాత్లో ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలపై మస్కట్ మున్సిపాలిటీ కొరడా
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- ‘వాళ్లు మాట్లాడుకోనివ్వండి’.. విమర్శలను ఎదుర్కోవడం పై షేక్ మహమ్మద్ కీలక సందేశం
- డేటా సెంటర్లకు నీటి వినియోగం పై సీఎం చంద్రబాబు స్పష్టత
- పిల్లల గేమింగ్ లింకులపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో ఆగస్టు 31 నుంచి స్కూల్స్ రీ ఓపెన్..తదుపరి సెలవులు ఎప్పుడంటే?
- ఇంట్లో అక్రమంగా క్లినిక్.. విదేశీ మహిళ అరెస్ట్..!!
- బరువు తగ్గించే మందులపై ఖతార్ వైద్య నిపుణుల హెచ్చరిక..!!
- సౌదీలో భారీ డిస్కౌంట్లు.. 10 లక్షలకు పైగా ఉత్పత్తులపై ధరల తగ్గింపు..!!







