ఆయిల్ & నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ స్కాలర్ షిప్ లకు దరఖాస్తులు!
- January 20, 2023
న్యూ ఢిల్లీ: ఆయిల్ & నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ONGC) 2021-22 విద్యా సంవత్సరానికిగాను విద్యార్ధులకు స్కాలర్ షిప్స్ అందించనుంది. దీనికి గాను అర్హులైన డిగ్రీ, పీజీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హతలకు సంబంధించి డిగ్రీ స్కాలర్ షిప్ లకు ఇంటర్లో 60 శాతం మార్కులు, పీజీ స్కాలర్ షిప్స్ కు డిగ్రీలో 60 శాతం మార్కులు ఉండాలి.
ఇంజినీరింగ్/ఎంబీబీఎస్/మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ ఉత్తీర్ణత. 2021-22 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల వయసు 30 సంవత్సరాలలోపు ఉండాలి. అలాగే జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉపకారవేతనాలు పొందడానికి అర్హులు. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల్లోపు ఉండాలి. స్కాలర్ షిప్స్ లో మహిళ అభ్యర్థులకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు.
ఎంపిక విధానం అకడమిక్ మార్కులు, క్వాలిఫైయింగ్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ప్రతి ఏటా స్కాలర్ షిప్ గాను రూ.48000 చెల్లిస్తారు.దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదిగా మార్చి06, 2023.గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.ongcscholar.org/ పరిశీలించగలరు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







