మస్కట్ నైట్స్ 2023 ఈవెంట్‌లు ప్రారంభం

- January 20, 2023 , by Maagulf
మస్కట్ నైట్స్ 2023 ఈవెంట్‌లు ప్రారంభం

మస్కట్: ప్రజలు, టూరిస్టులు, సమాజంలోని వివిధ వర్గాల వారిని అలరించుందకు మస్కట్ నైట్స్ 2023 వచ్చేసింది. మస్కట్ గవర్నర్ సయ్యద్ సౌద్ హిలాల్ అల్ బుసాయిదీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఈవెంట్ 4 ఫిబ్రవరి 2023 వరకు కొనసాగుతుంది. మస్కట్ నైట్స్ నాలుగు ప్రదేశాలలో ఖురమ్ నేచురల్ పార్క్, అల్ నసీమ్ పార్క్, ఒమన్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ (OCEC), ఒమన్ ఆటోమొబైల్ అసోసియేషన్ లలో జరుగుతున్నాయి. ప్రతిరోజూ ప్రజలకు, సందర్శకులకు సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంటాయి. అయితే వారాంతాల్లో లొకేషన్‌లు 12 అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com