ఆ స్టార్ డైరెక్టర్‌కి మెగాస్టార్ మళ్లీ ఛాన్సిచ్చాడా.?
- January 20, 2023
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అయిన వి.వి.వినాయక్, ఆ మధ్య వరుస ఫెయిల్యూర్స్ వెంటాడాయ్. అక్కినేని హీరో అఖిల్‌తో ‘అఖిల్’ సినిమాని తెరకెక్కించి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాడు. దాంతో, అంతవరకూ సంపాదించిన కెరీర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది వినాయక్‌కి.
ఆ డ్యామేజీ భారం తట్టుకోలేక, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిన వినాయక్‌ని వెన్ను తట్టి ప్రోత్సహించాడు చిరంజీవి. సెకండ్ ఇన్నింగ్స్‌లో తన తొలి సినిమాకి డైరెక్షన్ ఛాన్సిచ్చి మళ్లీ ఇమేజ్ నిలబెట్టాడు.
ఆ తర్వాత కూడా వినాయక్ పెద్దగా సినిమాలు చేసింది లేదు. మళ్లీ చిరంజీవితోనే వినాయక్ ఇంకో సినిమా చేయబోతున్నాడనీ తాజా సమాచారం. అదో రీమేక్ మూవీ అట. తమిళ హీరో అజిత్ నటించిన ‘విశ్వాసం’ సినిమాని తెలుగులో వినాయక్ ద్వారా రీమేక్ చేయాలనుకుంటున్నాడట చిరంజీవి.
ఆల్రెడీ అజిత్ నటించిన ‘వేదాళం’ మూవీనే ‘భోళా శంకర్’గా తెలుగులో రీమేక్ చేస్తున్నాడు చిరంజీవి. మళ్లీ అజిత్ సినిమానే సెలెక్ట్ చేసుకోవడం పట్ల అభిమానులు ఒకింత అసహనం వ్యక్తం చేస్తుండగా, జస్ట్ ఈ సినిమాలోని థీమ్‌ని మాత్రమే తీసుకుని వినాయక్ కథ సిద్ధం చేస్తున్నాడనీ తెలుస్తోంది.
తాజా వార్తలు
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు
- వైకుంఠ ద్వార దర్శనాల పై భక్తుల్లో విశేష సంతృప్తి
- అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ
- తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!
- ‘ఫా9లా’ క్రేజ్.. త్వరలో ఇండియా టూర్‌కు ఫ్లిప్పరాచి..!!







