రష్మిక వెర్సస్ రకుల్: ఓటీటీ క్వీన్ ఎవరో.!
- January 20, 2023
బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదండోయ్. మారిన సినిమా పరిస్థితుల నేపథ్యంలో ఓటీటీ వద్ద కూడా వార్ గట్టిగానే నడుస్తోంది. ఆ క్రమంలోనే ఈ శుక్రవారం ఓటీటీ తెరపై పోటీకి దిగుతున్నారు ఇద్దరు ముద్దుగుమ్మలు.
వారెవరో కాదు, నేషనల్ క్రష్ రష్మికా మండన్నా, ఓబులమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ‘మిషన్ మజ్ను’ సినిమాతో రష్మిక మండన్నా శుక్రవారం ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
అలాగే, ‘ఛత్రివాలీ’ సినిమాతో రకుల్ ప్రీత్ సింగ్ ఓటీటీ ప్రేక్షకుల్ని పలకరించింది. రెండు డిఫరెంట్ నేపథ్యమున్న కథనాలు. అయితే, బజ్ పరంగా చూస్తే, రష్మిక ‘మిషన్ మజ్ను’కి ఎక్కువ బజ్ కనిపించింది. ప్రమోషన్లు కూడా గట్టిగా చేశారీ సినిమాకి.
అలాగని రకుల్ ప్రీత్ ఏమీ తక్కువ కాదండోయ్. సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యతను వివరిస్తూ తనదైన పర్‌ఫామెన్స్‌తో చెలరేగిపోయింది. చూడాలి మరి, ప్రేక్షకుల్ని ఎవరు ఎక్కువగా మెప్పించగలరో కాసేపట్లో తేలిపోనుంది.
తాజా వార్తలు
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!
- కువైట్ లో దుమ్ముతో కూడిన గాలులు, చిరు జల్లులు..!!
- జబల్ షమ్స్లో జీరో కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదు..!!
- జెడ్డా పోర్టులో 47.9 లక్షల ఆంఫెటమైన్ పిల్స్ సీజ్..!!
- డిజిటల్ చెల్లింపులకే యువ ఎమిరాటీలు మొగ్గు..!!
- శంకర నేత్రాలయ U.S.A. ఆధ్వర్యంలో 'ఎకోస్ ఆఫ్ కంపాషన్'
- KL యూనివర్సిటీలో ETV విన్ వారి WIN.Club ప్రారంభం
- తెలంగాణ: 75 ప్రైవేట్ బస్సుల పై కేసులు







