పోలీసు పాత్రలో నాగచైతన్య..
- April 29, 2016
నాగచైతన్య ఇప్పటిదాకా పోలీసు పాత్రలో నటించింది లేదు. 'తడాఖా' సినిమాలో అనధికారికంగా పోలీసు పనుల్ని చక్కబెడుతుంటాడంతే. ఈసారి మాత్రం నేనేరా పోలీస్... అంటూ డైరెక్టుగా గర్జించబోతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న 'సాహసం శ్వాసగా సాగిపో' అనే సినిమాలోనే చైతూ పోలీసుగా కనిపిస్తాడని సమాచారం. తొలి సగభాగంలో ప్రేమకథ వుంటుందని, మలి సగభాగంలో యాక్షన్ నేపథ్యం వుంటుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. దీన్నిబట్టి మలిసగభాగంలోనే చైతూ పోలీసు గెటప్‌లో కనిపించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. గౌతమ్ మేనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చైతూ సరసన మంజిమ మోహన్ నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







