ఫిబ్రవరి 13న తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోడీ
- January 21, 2023
న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన ఖరారైంది. ఫిబ్రవరి 13న రాష్ట్రానికి మోడీ రానున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు రాష్ట్రంలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ బిజెపి నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడనున్నారు.
కాగా, వాస్తవానికి సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ట్రయిన్ ను ప్రారంభించడానికి ఈ నెల 19నే మోడీ తెలంగాణలో పర్యటించాల్సింది. కానీ అనివార్య కారణాలవల్ల టూర్ క్యాన్సిల్ అయ్యింది. దీంతో అనుకున్న టైం కంటే ముందే ఈ నెల 15న సికింద్రాబాద్- వైజాగ్ వందేభారత్ ట్రయిన్ ను మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. దీంతో ఇపుడు మోడీ టూర్ ఖరారయ్యింది.
మరోవైపు ఈనెల 28న రాష్ట్రంలో జరగాల్సిన కేంద్ర మంత్రి అమిత్‌షా పర్యటన పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో వాయిదా పడింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







