మళయాళ నటుడు అబుదాబి ఎయిర్ పోర్టులో అరెస్ట..
- April 29, 2016
మళయాళ నటుడు జినూ జోసెఫ్ శుక్రవారం అబుదాబి ఎయిర్ పోర్టులో అరెస్టయ్యారు. ఈ విషయాన్ని ఆయనే తన ఫేస్ బుక్ అకౌంట్లో శుక్రవారం మధ్యహ్నం పోస్ట్ చేశారు. న్యూయార్క్ నుంచి అబుదాబికి ఎతిహాద్ విమానంలో బయల్దేరిన జినూ నిద్రపట్టడంలేదని టీవీ ఆఫ్ చేయాలని కోరగా అందుకు క్రూ సిబ్బందిలో ఒకరు నిరాకరించారు.ఈ సందర్భంగా జినూ, సిబ్బంది మధ్య కొద్దిపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. సిబ్బందితో జరిగిన సంభాషణను జినూ తన మొబైల్ లో వీడియో రికార్డ్ చేయడానికి ప్రయత్నించారు. దానిని సిబ్బంది అడ్డకోవడంతో వారి మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది. జరిగిన సంఘటనపై సిబ్బంది ఫిర్యాదు చేయడంతో జినూను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.అబుదాబి ఎయిర్ పోర్టు పోలీసులు తనను అరెస్టు చేసినట్లు జోసెఫ్ ఆ తర్వాత ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ఎతిహాద్ ఎయిర్ సర్వీస్ సరిగా లేవని, ప్రయాణ సమయంలో సిబ్బంది తనపై వివిక్ష చూపారని , ఈ విషయాన్ని మిగతా అందరికీ షేర్ చేయాలని అందులో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







