తల్లి కావాలన్న కోరిక తేలికైన వైద్యం తో నెరవేరుతుంది
- April 29, 2016
సాధారణంగా బహిష్టు కాలంలో నెలకొక 'ఎగ్' విడుదలవుతూ ఉంటుంది. దీని ద్వారా చేసే ఐవిఎఫ్(ఇన్విట్రోఫెర్టిలైజేషన్ - టెస్ట్‌ట్యూబ్ బేబీ)ని నాచురల్ సైకిల్ ఐవిఎఫ్ అంటారు. ఇక రెండవది కన్వెన్షనల్ ఐవిఎఫ్ - కొన్ని హార్మోన్స్‌ని ఇంజక్ట్ చేయడం వల్ల ఎక్కువ 'ఎగ్స్' పుట్టి ఐవిఎఫ్ సైకిల్ విజయవంతమవుతుం దని అభిలషిస్తుంటారు. ఇలా హార్మోన్ ఇంజక్షన్స్ చేయడం వల్ల ఆస్త్రీకి మల్టిపుల్ ప్రెగ్నె సీస్ (ఎక్కువ శిశువులు) రావచ్చు. ఒవేరియన్ హైపర్‌స్టిమ్యులేషన్ సిం డ్రోమ్ కలుగవచ్చు. ఒక్కోసారి హార్మోన్స్ వల్ల సైడ్ఎఫెక్ట్స్ ఉండ వచ్చు. కాబట్టి హార్మోన్స్ ఇవ్వకుండాను, లేకపోతే చాలా తక్కువస్థాయిలో హార్మోన్స్ ఇచ్చో స్త్రీకి నెలనెలా ఒక 'ఎగ్' వచ్చేటట్లు చూస్తాం.దీని వల్ల ఖర్చు ఉండదు, సైడ్ఎఫెక్ట్స్ ఉండవు.క్రమంతప్పకుండా బషిష్టులువస్తున్న వారిలో ఈ నాచురల్ సైకిల్ ఐవిఎఫ్ ఉత్తమం. క్రమం తప్పకుండా బహిష్టులు రాకపోతే ్కఇైఇ నాచురల్సైకిల్ పనికిరాదు. నాచురల్సైకిల్ ఐగఊ 35 సంవత్సరాలు పైబడిన వారికి వరంలాంటిది. గతంలో ఐగఊ ఫెయిలయినవారికి లేకపోతే కన్వెన్షనల్ ఐగఊ సైకిల్లో తక్కువ ఎగ్స్ వచ్చేవారికి కూడా ఇది మంచిది. కాబట్టి ఇది స్త్రీలలో నాచురల్ ఐగఊ ద్వారా గర్భం వస్తుంది. అలా వాళ్ళ ఎగ్స్‌తో గర్భం దరించలేకపోతే దాతల ఎగ్స్‌ని వాడి గర్భవతులు కావచ్చు.వైద్యరంగంలో అభివృద్ది ద్వారా కలిగిన స్కానింగ్ టెక్నిక్, కల్చర్ కండిషన్స్ లాంటి వాటి వల్ల ఐగఊ రేటు పెరుగుతుంది. కాబట్టి ఒక్క ఎగ్‌తో కూడా మనం విజయాన్ని పొందవచ్చు. పాశ్చాత్య దేశాలలో కూడా ఒక మంచి ఎగ్‌ని ఎంపికచేసి ప్రయత్నించడం వల్ల మల్టిపుల్ప్రెగ్నెసీస్ తగ్గుతాయి. నాచురల్ సైకిల్లో లభించే ఎగ్ చాలా శ్రేష్ట మైనది. గతంలో కాన్సర్స్ వున్నవాళ్ళకి మందుల్ని తట్టుకోలేని వాళ్ళకి నాచురల్ సైకిల్మంచిది.ఈ పద్దతి వల్ల 40సంవత్సరాల వయస్సులో వున్న స్త్రీలు కూడా తయ ఎగ్తోనే గర్భాన్ని దరించే అవకాశముంది. కాకపోతే వాళ్ళు రెగ్యులర్‌గా బహిష్టులవుతుండాలి.నాచురల్ సైకిల్ పేషెంట్స్ రక్తపరీక్షల తోనూ, స్కాన్స్తోనూ మానిటర్ చేయబడుతుంటారు. ఎనస్థీషియా ఇచ్చి ముఖ్యమైన పాలికల్లో ఎగ్ పరిపక్వత చెందినప్పుడు సేకరి స్తారు. భర్త స్పెర్మ్తోనే ఈ ఎగ్ లాబరెటరీలో కలుపబడుతుంది. కలయిక జరిగిన తరువాత విభజన చెందుతున్న ఎంబ్రి యోని తెచ్చి యుటెరెస్లో ప్రవేశపెడతారు. ఈ టెక్నిక్‌లో ప్రధానమైంది అండం విడుదలయ్యే సమయాన్ని ఖచ్చితంగా అంచనా వేసుకోవడం. కొన్ని సార్లు ఎగ్సేకరణకు ముందే ఎగ్ విడుదలవుతుంది. ఈ విధంగా గర్భంలోపల కొన్ని లోపాలున్నప్పుడు ఎగ్‌ని, భర్తతాలూకు స్పెర్మ్‌ని బయట కలుసుకునేట్లు చేసి జాగ్రత్తగా ఆ యెంబ్రియోని యుటెరస్‌లో ప్రవేశపెడతారు. ఈ పద్దతి వల్ల ఒత్తిడి వుండదు, ఖర్చు తక్కువ, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తల్లి కావాలన్న కోరిక నెరవేరుతుంది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







