పురుషుల టీ20 జట్టును ప్రకటించిన ఐసీసీ.. ముగ్గురు భారత క్రికెటర్లకు చోటు
- January 23, 2023
పురుషుల టీ20 జట్టును ఐసీసీ సోమవారం ప్రకటించింది. భారత జట్టు నుంచి విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు ఐసీసీ టీ20 జట్టుకు ఎంపికయ్యారు. ఈ టీమ్‌కు జోస్ బట్లర్‌ను కెప్టెన్, వికెట్ కీపర్‌గా ఎంపిక చేసింది.
ICC : పురుషుల టీ20 జట్టును ఐసీసీ సోమవారం ప్రకటించింది. 2022 సంత్సరానికి గానూ 11 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. భారత జట్టు నుంచి అత్యధికంగా ముగ్గురు క్రికెటర్లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు ఐసీసీ టీ20 జట్టుకు ఎంపికయ్యారు. ఇంగ్లండ్ టీమ్ నుంచి జోస్ బట్లర్, ఆల్‌రౌండర్ సామ్ కరన్, పాక్ నుంచి రిజ్వాన్, హ్యారిస్ రౌఫ్‌లను సెలక్ట్ చేసింది. ఈ లిస్టులో స్పిన్నర్ హసరంగ (శ్రీలంక), సికిందర్ రజా (జింబాబ్వే), జోష్ లిటిల్ (ఐర్లాండ్), గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్) ఉన్నారు. ఈ టీమ్‌కు జోస్ బట్లర్‌ను కెప్టెన్, వికెట్ కీపర్‌గా ఎంపిక చేసింది. రిజ్వాన్, బట్లర్‌లను ఓపెనింగ్ జోడీగా ప్రకటించింది.
జట్టు ఇదే.. జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), మొహమ్మద్ రిజ్వాన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, సికిందర్ రజా, హార్ధిక్ పాండ్యా, సామ్ కరన్, వనిందు హసరంగ, హ్యారిస్ రౌఫ్, జోష్ లిటిల్.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







