అపార్ట్మెంట్లో వ్యక్తి నిర్బంధం.. నలుగురు ఆఫ్రికన్లకు 6 నెలల జైలు శిక్ష
- January 23, 2023
దుబాయ్: ఎమిరేట్‌లోని అపార్ట్మెంట్లో ఒక వ్యక్తిని నిర్బంధించినందుకు నలుగురు నిందితులకు ఆరు నెలల జైలు శిక్ష పడింది. శిక్ష కాలం ముగిసిన తర్వాత వారిని బహిష్కరించనున్నారు. నిందితుల్లో ఇద్దరు ఆఫ్రికన్ మహిళలు, పురుషులు ఉన్నారు. వీరిని దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్రిమినల్ కోర్టుకు రిఫర్ చేసింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఈ ఘటన గతేడాది ఆగస్టులో జరిగింది. ఒక ఆఫ్రికన్ తన స్నేహితుడు అపార్ట్మెంట్లో నిర్బంధించబడ్డాడని, ఒక ప్రత్యేక ప్రదేశంలో Dh800 ఇవ్వాలని కాల్ వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందగానే పోలీసులు సదరు అపార్టుమెంట్ కు చేరుకొని బాధితుడిని విడిపించి, అతడిని నిర్బంధించిన నలుగురు ఆఫ్రికన్లను అదుపులోకి తీసుకున్నారు. నిర్బంధించిన వ్యక్తి తమ దగ్గర అప్పు తీసుకున్నాడని, తిరిగి అడిగినప్పుడు స్పందించలేదని, అందుకే స్నేహితుల సాయంతో అపార్టుమెంట్లో నిర్బంధించినట్లు విచారణ సందర్భంగా నిందితులు తెలిపారు. కానీ వారి వాదనలతో కోర్టు ఏకీభవించలేదు. దోషులకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష అనుభవించిన తర్వాత వారిని బహిష్కరించాలని తీర్పునిచ్చింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







