గతేడాది చైల్డ్ హెల్ప్‌లైనుకు 350 ఫిర్యాదులు: NFSP
- January 24, 2023
జెడ్డా : 2022 సంవత్సరంలో రాజ్యంలో అన్ని ప్రాంతాల నుండి పిల్లలకు సంబంధించిన మొత్తం 350 ఫిర్యాదులు అందాయని సౌదీ అరేబియా నేషనల్ ఫ్యామిలీ సేఫ్టీ ప్రోగ్రామ్ (NFSP) చైల్డ్ హెల్ప్‌లైన్ విభాగం తెలిపింది. రియాద్, మక్కా ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో కాల్లు వచ్చాయని పేర్కొంది. పిల్లలపై జరిగే హింస, మానసిక, సమాజిక ఆరోగ్య సమస్యలపై చైల్డ్ హెల్ప్‌లైన్ కాల్స్ స్వీకరిస్తుంది. వచ్చిన ఫిర్యాదులలో అత్యధికం సాధారణ కేటగిరీకి చెందినవేనని తెలిపింది. హై-రిస్క్ కేసులను నిర్దిష్ట అధికారులకు రిఫర్ చేసినట్లు పేర్కొంది. చైల్డ్ హెల్ప్‌లైన్‌కు సమాజంలోని అన్ని వర్గాల నుండి ఆసక్తి పెరుగుతోందని చెప్పింది. చైల్డ్ హెల్ప్‌లైన్, ఉచిత హెల్ప్‌లైన్ 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మద్దతుగా నిలుస్తుందని చైల్డ్ హెల్ప్‌లైన్ విభాగం తెలిపింది. పిల్లల హక్కలపై పేరెంట్స్ కు అవగాహన కల్పిస్తున్నట్లు, హెల్ప్ లైన్ అందించే సేవల గురించి పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ప్రచార క్యాంపెయిన్లను నిర్వహిస్తున్నట్లు NFSP వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







