జనవరి 26న ఇండియన్ ఎంబసీలో గణతంత్ర దినోత్సవం
- January 24, 2023
కువైట్: జనవరి 26వ తేదీన( గురువారం) ఉదయం ఎంబసీ ప్రాంగణంలో 74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు కువైట్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ఉదయం 9:00 గంటలకు జరిగే ఈ వేడుకకు హాజరు కావాల్సిందిగా భారతీయ పౌరులను ఆహ్వానించింది. ఉదయం 9:00 గంటలకు భారత రాయబారి జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని, అనంతరం భారత రాష్ట్రపతి సందేశాన్ని చదివి విన్పిస్తారని తెలిపింది. ఈ సందర్భంగా సంఘం సభ్యులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే భారతీయ పౌరులందరు భారత రాయబార కార్యాలయం (https://forms.gle/X4yVo76572WjN7cu5) లింక్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరింది.
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







