దుబాయ్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్.. 2 కొత్త వంతెనలు ప్రారంభం
- January 24, 2023
దుబాయ్: సిలికాన్ ఒయాసిస్, అకడమిక్ సిటీకి సేవలందించే కొత్త వంతెనలను దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రారంభించింది. 120 మీటర్ల పొడవైన రెండు వంతెనలు షేక్ జాయెద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ స్ట్రీట్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించారు. ఇవి దుబాయ్-అల్ ఐన్ రహదారితో కూడలి నుండి అకడమిక్ సిటీ రౌండ్‌అబౌట్ వరకు 3 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నాయి. ప్రతి దిశలో నాలుగు లేన్‌లను కలిగి ఉన్నాయి. వంతెనలు రెండు దిశలలో గంటకు 14,400 వాహనాలు ప్రయాణించేలా సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ కొత్త వంతెనల కారణంగా షేక్ జాయెద్ బిన్ హమ్దాన్ అల్ నహ్యాన్ స్ట్రీట్ వెంట ట్రాఫిక్ సాఫీగా సాగనున్నది. దుబాయ్ సిలికాన్ ఒయాసిస్ నివాసితులు, 25కి పైగా విశ్వవిద్యాలయాలు, కళాశాలలలో చదువుతున్న 27,500 మంది విద్యార్థుల జనాభాతో పాటు చుట్టుపక్కల అభివృద్ధి ప్రాజెక్టులలో పనిచేసే వారికి ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయోజనం కలుగనుంది. వైస్ ప్రెసిడెంట్ హిస్ హైనెస్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టును చేపట్టామని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్, డైరెక్టర్ జనరల్ మత్తర్ అల్ తాయర్ తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







