తృణ ధాన్యాలతో మధుమేహానికి చెక్ పెట్టొచ్చా.?

- January 24, 2023 , by Maagulf
తృణ ధాన్యాలతో మధుమేహానికి చెక్ పెట్టొచ్చా.?

మధుమేహం ఓ దీర్షకాలికమైన వ్యాధి. ఒక్కసారి ఈ వ్యాధి ఎటాక్ అయితే, దీనికి శాశ్వత పరిష్కారం లేదు. కేవలం లక్షణాలను మాత్రమే నియంత్రించుకోవడం అవుతుంది. ముఖ్యంగా మధుమేహులు డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా వుండాలి. ఏది పడితే అది తినేయడం సరికాదు. 

తాము తీసుకునే ఆహారం మీద సంపూర్ణమైన అవగాహనతో వుండాలి. సమతుల్యమైన ఆహారంతో మధుమేహులు సురక్షితంగా జీవనాన్ని గడపొచ్చునని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా తృణ ధాన్యాలను తమ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో వుంచుకునే అవకాశం కలుగుతుంది. ఆ క్రమంలోనే తృణధాన్యాలు మధుమేహుల పాలిట వరంగా చెబుతారు. 

జొన్నలు
జొన్నలతో చేసిన అన్నం లేదా రొట్టెలు మధుమేహులకు మంచి ఆహారం. జొన్నలు చక్కెర స్థాయిలను అదుపులో వుంచడంతో పాటూ, శరీరానికి కావల్సిన ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లను కలిగి వుంటాయ్.

రాగులు
రాగుల్లో అధిక శాతం ఫైబర్ వుంటుంది. అలాగే, కార్భో హైడ్రేట్లు కూడా పుష్కలంగా వుంటాయ్. దీంతో, జీర్ణక్రియను వేగవంతం చేయడంతో పాటూ, చక్కెర స్థాయిని అదుపులో వుంచేందుకు కూడా ఇవి తోడ్పడతాయ్.

వీటితో పాటే సజ్జలు, ఓట్స్, బార్లీ తదితర తృణ ధాన్యాలు మధుమేహ రోగులకు మంచి ఆహారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com