శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో తొలిసారి క్రీడా కార్యక్రమం
- January 26, 2023
సింగపూర్: గత రెండేళ్లుగా వైవిధ్యభరితమైన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి, ప్రపంచవ్యాప్తంగా అందరి అభిమానాన్ని సంపాదించుకున్న మీ "శ్రీ సాంస్కృతిక కళాసారథి" సంస్థ తొలిసారి సింగపూర్ లో క్రీడా రంగంలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.సంక్రాంతి పండగ సందర్భంగా మైగ్రెంట్ ఫోర్స్ క్రికెట్ లీగ్ (MFCL) ని Terusan Recreation Centre లో 3 రోజుల పాటు (22-24జనవరి) ఘనంగా నిర్వహించింది... వానను సైతం లెక్కచేయకుండా సింగపూర్ లో నలుమూలలో నివసించే కార్మిక సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. మొత్తం 12 టీంలు లెవన్ టైగెర్స్, విక్టోరియన్స్ (మెగాయార్డ్), కూల్ ట్రంప్స్ (పెంజూరు), సెంబావాన్గ్ స్ట్రైకర్స్ (సెంబావాన్గ్), కెప్పెల్ సన్రై జర్స్ (అకాసియా లాడ్జ్), సింగపూర్ తెలంగాణ (వెస్ట్ కోస్ట్), కెన్టెక్ హాన్టెర్స్ (కెన్టెక్ లాడ్జి), రాయల్ గైస్ (కాకిబుకిత్), తెలుగు సూపర్ కింగ్స్ (సీడీపీల్/జేటీసీ), దుర్గ ఎలెవెన్స్ (జురాన్గ్ ఐలాండ్), రోటరీ కోబ్రాస్ (TR), మరియు ట్రోఫీ ఫైటర్స్ ( Tuas View) పాల్గొన్న ఈ టోర్నమెంట్ లో, ముత్యాల రమేష్ నాయకత్వంలో కూల్ ట్రంప్స్ (పెంజూరు) విజేత గా నిలవగా, చిన్నబోయిన రవి కుమార్ నాయకత్వంలో దుర్గ ఎలెవెన్స్ (జురాన్గ్ ఐలాండ్) టీం ద్వితీయ, సంకాబత్తుల దుర్గ బాబు నాయకత్వంలో రాయల్ గైస్ (కాకిబుకిత్) టీం తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు.మొదటి బహుమతిగా 500 డాలర్స్, ద్వితీయ బహుమతి గా 300 డాలర్స్, తృతీయ బహుమతిగా 200 డాలర్స్ మరియు ట్రోఫీస్ ని విజేతలకు నిర్వాహుకులు అందచేశారు.
సీడీ దిలీప్ వర ప్రసాద్ మాన్ అఫ్ ది మ్యాచ్ ట్రోఫీ అందుకోగా, బెస్ట్ బౌలర్ గా మహేశ్వరన్ సూర్య ప్రకాష్, బెస్ట్ క్యాచ్ కు పందాల జైరాం నాయుడు ఎంపికయ్యారు. ఈ టోర్నమెంట్ కి అంపైర్ గా శ్రీనివాస్ యాదవ్ మరియు సంగటి చంద్ర మోహన్ రెడ్డి వ్యవహరించారు.
గిరిధర్ సారాయి నాయకత్వంలో జరిగిన ఈ కార్యాక్రమములో నగేష్ టేకూరి, పోతగౌని నర్సింహా గౌడ్, అశోక్ ముండ్రు, కంకిపాటి శశిధర్ , సుదర్శన్ పూల, రాము చామిరాజు, సుధాకర్ జొన్నాదుల, పాతూరి రాంబాబు, శ్రీధర్ భరద్వాజ్, సునీల్ రామినేని, కరుణాకర్ కంచేటి , మిట్టా ద్వారకానాథ్, తోట సహదేవుడు, S కుమార్, లీల మోహన్, సురేంద్ర చేబ్రోలు తదితరులతో పాటు అనేకమంది వాలంటీర్స్ వచ్చి ఈ 3 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. వీరితో పాటు తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షులు రమేష్ గడప మరియు వారి సభ్యులు నీలం మహేందర్. గారెపల్లి శ్రీనివాస్, SP Sysnet కొల్లా శివప్రసాద్ తదితరులు విచ్చేసి నిర్వాహుకులను మరియు క్రీడాకారులను అభినందించారు.
శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ విజయవంతం కావటం పట్ల హర్షం ప్రకటిస్తూ, దానికి సహకరించిన Terusan Recreation Centre యాజమాన్యానికి, వాలంటీర్స్, ఆర్ధిక సహాయం అందించిన సరిగమ బిస్ట్ర రెస్టారంట్, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్, SP Sysnet, టింకర్ టాట్స్ మొంటోసిరి, శబ్ద కాన్సెప్ట్స్, శంకర్ వీర, బాలకృష్ణ, సుబ్బు వి పాలకుర్తి లకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసారు.


తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!







