ఆస్ట్రేలియా ఓపెన్ గెలిచిన జకోవిచ్..నాదల్ రికార్డు సమం
- January 29, 2023
సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ చరిత్ర సృష్టించాడు. రికార్డు స్థాయిలో పదో సారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో గ్రీన్ ప్లేయర్ స్టెఫనోస్ సిట్సిపస్ను 6-3,7-6(7-4),7-5 స్కోరు తేడాతో ఓడించి ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ విజేతగా నిలిచాడు.
నువ్వా నేనా..
హోరా హోరీగా సాగిన ఫైనల్లో తొలి సెట్లో జకోవిచ్ స్పష్టమైన ఆధిక్యాన్ని చూపించాడు. సూపర్ స్మాష్లు, దుర్భేద్యమైన ర్యాలీలతో సిట్సిపస్కు చెమటలు పట్టించాడు. ఇదే క్రమంలో 6-3తో ఫస్ట్ సెట్ను సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత రెండో సెట్లో సిట్సిపస్ పుంజుకున్నాడు. దీంతో సెట్ టై బ్రేక్కు దారి తీసింది. టై బ్రేక్ లో విజృంభించిన జోకో..7-4తో రెండో సెట్ ను దక్కించుకున్నాడు. ఇక కీలకమైన మూడో సెట్ కూడా టఫ్ గా నడిచింది. సెట్ 6-6తో సమం కావడంతో టై బ్రేక్ కు దారి తీసింది. అయితే టై బ్రేక్ లో జకోవిచ్ అద్బుతంగా ఆడి 7-5తో సెట్తో పాటు మ్యాచ్ను కైవసం చేసుకున్నాడు.
నాదల్ రికార్డు సమం..
ఆస్ట్రేలియా ఓపెన్ 2023 టైటిల్ గెలవడం ద్వారా అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించిన నాదల్ (22)రికార్డును జకోవిచ్ సమం చేశాడు. అంతేకాదు మరోసారి ప్రపంచ నెంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. అంతేకాదు ఓటమి ఎరుగని రికార్డును కొనసాగించాడు. ఇప్పటి వరకు జకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ లో వరుసగా గత 28 మ్యాచుల్లో విజయం సాధించాడు. మొత్తంగా ఆస్ట్రేలియాలో వరుసగా 41 మ్యాచులు గెలిచాడు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!







