తిరుచ్చి విమానాశ్రయంలో 10,000 డాలర్ల విదేశీ కరెన్సీ స్వాధీనం
- January 29, 2023
యూఏఈ: భారతదేశంలోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రయాణికుడి లోదుస్తులలో దాచిన 10,000 డాలర్ల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) జనవరి 28న అనుమానంతో విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడిని తనిఖీ చేయగా.. లోదుస్తులలో దాచిన $10,000(రూ.805,500) ను గుర్తించినట్లు వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్లో కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) ఒక వ్యక్తిని అడ్డగించి టిన్‌లో దాచిపెట్టిన రెండు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకున్న బంగారం బరువు 147.5 గ్రాములు ఉంటుందని అప్పట్లో అధికారులు వెల్లడించారు. అలాగే నవంబర్ 2022 లోనూ తిరుచిరాపల్లి విమానాశ్రయంలో ఒక మహిళా ప్రయాణికురాలి నుండి సుమారు 145 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు గుర్తుచేశారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో ఇక ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై..!!
- అద్దెదారులకు షార్జా గుడ్ న్యూస్.. ఫైన్ మినహాయింపు..!!
- ICAI బహ్రెయిన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు..!!
- ఖతార్ లో గోల్డ్ జ్యువెల్లరీ సేల్స్ కు కొత్త ఆఫీస్..!!
- కువైట్‌లో 23.7% పెరిగిన రెమిటెన్స్..!!
- FII ఎడిషన్లు సక్సెస్.. $250 బిలియన్ల ఒప్పందాలు..!!
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్







