బీరకాయ రొయ్యల కూర

- April 30, 2016 , by Maagulf
బీరకాయ రొయ్యల కూర

కావలసిన పదార్థాలు : బీరకాయలు - 2, శుభ్రం చేసిన రొయ్యలు - 400 గ్రా., నూనె - 2 టీ స్పూన్లు, ఉల్లిపాయలు - 2, పచ్చిమిర్చి - 4, కరివేపాకు - 4 రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్‌ స్పూను, కారం - ఒకటిన్నర టీ స్పూను, గరం మసాల పొడి - అర టీ స్పూను, ఉప్పు - తగినంత, కొత్తిమీర తరుగు - గుప్పెడు. దనియా, జీర, పసుపు పొడులు - అర టీ స్పూను చొప్పున.

తయారుచేసే విధానం : రొయ్యల్లో 1 టీ స్పూను కారం, పావు టీ స్పూను ఉప్పు, దనియా, జీర, పసుపు పొడులు వేసి బాగా కలపాలి. తర్వాత కొద్ది నూనెలో నీరంతా ఆవిరయ్యేవరకు చిన్నమంటపై వేగించి పక్కనుంచాలి. అదే కడాయిలో మరికొంత నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. ఇప్పుడు (తొక్కతీసిన) బీర ముక్కలు, ఉప్పు కలిపి మగ్గించాలి. ముక్కలు సగం ఉడికిన తర్వాత రొయ్యలతో పాటు పావుకప్పు నీరు పోసి ఉడికించాలి. కూర చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి దించేయాలి. వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com