కువైట్లో ప్రయాణ, పర్యాటక ఆదాయంలో 338 శాతం పెరుగుదల
- January 30, 2023
కువైట్: కువైట్లో ట్రావెల్ అండ్ టూరిజం రంగం 2022 సంవత్సరంలో దాదాపు 75 శాతం వ్యాపారం పెరిగింది. కువైట్లోని ట్రావెల్, టూరిజం కార్యాలయాల ఆదాయం గత సంవత్సరంలో 338 శాతం పెరిగి 276.7 మిలియన్ దినార్లకు చేరుకుంది. అంతకుముందు 2020లో కరోనా సంక్షోభం సంభవించినప్పుడు 63.22 మిలియన్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అయితే, ఇది కరోనా సంక్షోభం కంటే ముందు 2019లో 308.18 మిలియన్ దినార్ల కంటే 10 శాతం తక్కువ కావడం గమనార్హం. పౌరులు, నివాసితులు దీర్ఘకాల అంతరాయం తర్వాత ప్రయాణించడానికి ఆసక్తిని చూపడంతో ఈ రంగానికి ఆదాయం పెరగడానికి కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రాబోయే జాతీయ సెలవు దినాలలో టర్కీ, దుబాయ్, కైరో ప్రాంతాలకు అధిక సంఖ్యలో ప్రయాణికులు వెళ్లే అవకాశం ఉందంటున్నారు.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







