దుబాయ్‌లో అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తు: ధర, చెల్లుబాటు, ప్రక్రియ
- January 30, 2023
దుబాయ్: విదేశాల్లో విహారయాత్రకు ప్లాన్ చేస్తున్నారా. ఆయా దేశాలలో రోడ్ ట్రిప్‌లు చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆలోచిస్తున్నారా. ఇంకేం ఫర్లేదు యూఏఈలో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు. యూఏఈ జారీ చేసే అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ (IDL) విదేశాలలో చెల్లుబాటు అవుతుంది. యూఏఈ ఆటోమొబైల్, టూరింగ్ క్లబ్ (ATCUAE) ప్రకారం.. యూఏఈ అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఎలాంటి పరీక్షలు, దరఖాస్తుల అవసరం లేకుండా యూఏఈ వెలుపల తమ వాహనాలను చట్టబద్ధంగా నడపడానికి వాహనదారులను అనుమతిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన IDL ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. ATCUAE ప్రకారం.. నివాసితులు యూఏఈలోని క్లబ్ కార్యాలయాలు లేదా ఎమిరేట్స్ పోస్ట్ ఆఫీస్‌లకు వ్యక్తిగతంగా వెళితే 30 నిమిషాలలోపు IDLని పొందవచ్చు. అలాగే ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా ఆన్లైన్ ద్వారా చేసిన దరఖాస్తులు.. తిరుగుటపాలో చిరునామాకు చేరేందుకు ఐదు పని దినాలు పట్టే అవకాశం ఉంది. దుబాయ్ నివాసితులు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) వెబ్సైట్లో ఐదు నిమిషాల్లో IDL కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్, ఎమిరేట్స్ ID, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, సేవా రుసుములతో దరఖాస్తు చేయవచ్చు. RTA వెబ్సైట్లో నాలెడ్జ్, ఇన్నోవేషన్ ఫీజులలో Dh20తో పాటు దుబాయ్‌లో IDLని జారీ చేయడానికి అయ్యే ఖర్చు Dh177గా ఉంది. అనంతరం డెయిరా లేదా అల్ బార్షాలోని కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్ల నుండి లైసెన్స్‌ని తీసుకోవచ్చు. దుబాయ్‌లో IDL డెలివరీ కావాలంటే సాధారణ డెలివరీకి మీకు Dh20 ఖర్చవుతుంది. మీరు దానిని అదే రోజున డెలివరీ కావాలంటే రుసుము కింద Dh35 చెల్లించాలి. రెండు గంటలలోపు డెలివరీకి 50 దిర్హామ్‌లు ఖర్చవుతాయి.
IDL హోల్డర్లు దుబాయ్‌లో డ్రైవ్ చేయవచ్చా?
చేయవచ్చు. RTA ప్రకారం IDLని కలిగి ఉన్న విజిట్ వీసాలో ఉన్నవారు దుబాయ్‌లో తేలికపాటి వాహనం లేదా మోటార్‌సైకిల్‌ను నడపవచ్చు. ట్రాన్సిట్ వీసా హోల్డర్లు చెల్లుబాటు అయ్యే IDL, బీమా కంపెనీ నుండి ఆమోదం కలిగి ఉంటే దుబాయ్‌లో రిజిస్టర్ చేయబడిన వాహనాన్ని నడపవచ్చు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







