యూఏఈలోని తెలుగు మహిళల ప్రతిభకు అవార్డుల ప్రధానం

- January 30, 2023 , by Maagulf
యూఏఈలోని తెలుగు మహిళల ప్రతిభకు అవార్డుల ప్రధానం

యూఏఈ: ఫెడరేషన్ ఆఫ్ NRI కల్చరల్ అసోసియేషన్స్ అండ్ గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ & కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూఏఈ లోని తెలుగు మహిళలకు సత్కారం మరియు అవార్డుల ప్రదానోత్సవం.షార్జాలోని ఎవాన్ హోటల్ బతుకమ్మ అవార్డ్స్ ప్రదానోత్సవం చాల ఘనంగా జరిగింది.వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న మహిళలను,మన సంస్కృతి సంప్రదాయాలు మరియు పండుగలను విదేశాలలో జరుపుతూ మన సంస్కృతి విశ్వవ్యాప్తం చేస్తున్న మహిళలను మరియు COVID WARRIORS ని ఘనంగా సత్కరించి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది.FNCA అధ్యక్షుడు మిర్యాల వరప్రసాద్ గత 10 సంవత్సరాలుగు వివిధ దేశాలలో అవార్డ్స్ ప్రదానం చేస్తూ,యూఏఈలో కూడా మూడవ సారి తెలుగు మహిళాలను గౌరవించుకోవడం చాల ఆనందంగా ఉందని ముందు ముందు మహిళలను ప్రోత్సహించే కార్యక్రమాలను చేస్తానని ప్రకటించారు,మహిళల సాధికారత అంశం పై GTWCA బాద్యులు  శామ్యూల్ ప్రసంగిస్తూ యూఏఈలోని తెలుగు మహిళల సేవలను కొనియాడారు, గల్ఫ్ తెలంగాణ అధ్యక్షుడు జువ్వాడి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ గల్ఫ్ దేశాలలో బాతులకమ్మ పండుగను మొదటగా జరిపిన సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ అవార్డ్స్ ప్రదానోత్సవం  జరగడం ఎంతో గర్వ కారణం అని ఇదే స్ఫూర్తి తో విశ్వవ్యాప్తంగా మన సంస్కృతి సామ్రాదాయాలు విలసిల్లాలని అందుకొరకు మహిళలకు ప్రోత్సాహక అవార్డ్స్ ప్రదానం చెయ్యడం జరిగిందని తెలిపారు.GTWCA ఉపాధ్యక్షులు మహమ్మద్ సలావుద్దీన్ మరియు కటకం రవి, మెట్ట రమేష్ చంద్ర,శంకర్ దేవరకొండ, విజయ్ యాదవ్, మల్లేష్,వంశీ గౌడ్, మోతే రాము, అనిల్, త్రిమూర్తులు, సౌమ్య జువ్వాడి, నాగమణి దామెర, పావని ,భారతి,పర్వీన్, తదితరులు ఈ కార్యక్రమం నిర్వహణలో ముందుండి విజ్జయవంతం చేశారు.ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com