మహాత్మా గాంధీ ప్రతిమను ఆవిష్కరించిన హిస్ హైనెస్ అల్ నహ్యాన్

- February 01, 2023 , by Maagulf
మహాత్మా గాంధీ ప్రతిమను ఆవిష్కరించిన హిస్ హైనెస్ అల్ నహ్యాన్

దుబాయ్: జనవరి 31, 2023న దుబాయ్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలో మహాత్మా గాంధీ ప్రతిమను యూఏఈ సహనం, సహజీవన(Tolerance and Coexistence) మంత్రి హిస్ హైనెస్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ఆవిష్కరించారు. యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్, దుబాయ్-నార్తర్న్ ఎమిరేట్స్‌లోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పూరి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి హిస్ హైనెస్ షేక్ నహ్యాన్‌తో కలిసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీకి ఇష్టమైన 'వైష్ణవ్ జన్ తో', 'రఘుపతి రాఘవ' భజనలను సోమదుత్తా బసు ఆలపించారు. 42 అంగుళాలు మహాత్మా గాంధీ ప్రతిమను నరేష్ కుమావత్ రూపొందించారు. ఈ ప్రతిమను న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) వారు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్లొమాటిక్ కమ్యూనిటీ సభ్యులు, ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డు గ్రహీతలు, దుబాయ్ - నార్తర్న్ ఎమిరేట్స్‌లోని ఇండియన్ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com