‘శాకుంతలం’ వాయిదా: ఈ షాక్ దిల్ రాజుకా.? సమంతకా.?
- February 01, 2023
సమంత లీడ్ రోల్ పోషించిన సినిమా ‘శాకుంతలం’. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఫిమేల్ లీడ్ పోషించగా, గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. 3డీ టెక్నాలజీతో రూపొందుతోన్న ఈ సినిమా నవంబర్లోనే రిలీజ్ కావల్సి వుంది. కానీ, ఫిబ్రవరి 17కు వాయిదా పడింది.
ఇప్పుడు ఈ డేట్ కూడా పోస్ట్‌పోన్ కానుందన్న గాసిప్ చక్కర్లు కొడుతోంది. దిల్ రాజు బ్యానర్లో రూపొందుతోన్న ఈ సినిమా పోస్ట్‌పోన్ గాసిప్స్.. రాజుగారిపై మరింత ఎఫెక్ట్ పడేలా కనిపిస్తోంది. సంక్రాంతికి ‘వారసుడు’ సినిమాతో తెగ ఓవరాక్షన్ చేసిన దిల్ రాజుకు లాస్ట్ మినిట్‌లో గట్టి షాకే తగిలింది. అనుకున్న డేట్‌కి ఆ సినిమాని రిలీజ్ చేయలేకపోయారు దిల్ రాజు. అలాగే, ఇప్పుడు ‘శాకుంతలం’ కూడా పోస్ట్ పోన్ అయ్యిందంటే, రాజుగారికి దెబ్బ పడ్డట్లే. చూడాలి మరి, ఈ ప్రచారంలో నిజమెంతో.!
మరోవైపు ఇటీవలే ‘యశోద’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది సమంత. మయోసైటిస్ వ్యాధి నుంచి తేరుకుని ఈ మధ్యనే షూటింగులు షురూ చేసింది. ఈ టైమ్‌లో ‘శాకుంతలం’ అనుకున్న టైమ్‌కి రిలీజ్ అవ్వడం సమంతకీ కీలకమే.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







