ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అతిపెద్ద ఉపశమనం..
- February 01, 2023
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అతిపెద్ద ఉపశమనం.. కొత్త ఆదాయపు పన్ను విధానంలో రూ. 3 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 3 నుంచి 6 లక్షల రూపాయల మధ్య ఆదాయంపై 5% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. రూ.6 నుంచి 9 లక్షల మధ్య ఆదాయంపై 10 శాతం, రూ. 9 నుంచి 12 లక్షల మధ్య ఆదాయంపై 15 శాతం, రూ. 12 నుంచి 15 లక్షల మధ్య ఆదాయంపై 20 శాతం, రూ. 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయంపై 30 శాతం ఆదాయపు పన్ను ఉంటుంది.
ప్రత్యక్ష పన్నుపై..
పన్ను పోర్టల్‌లో రోజుకు 72 లక్షల దరఖాస్తులు వస్తున్నాయని.. రీఫండ్ ప్రక్రియను 16 రోజుల వరకు తీసుకొచ్చామని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇందులో మరింత మెరుగుపడే దిశగా ముందుకు సాగుతున్నాం.
ప్రత్యక్ష పన్ను..
పన్ను రిటర్నుల ప్రాసెసింగ్‌ను 90 రోజుల నుంచి 16 రోజులకు తగ్గించామని.. ఒక్కరోజులోనే 72 లక్షల పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయని ఆర్థిక మంత్రి తెలిపారు. పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదుల పరిష్కారం మెరుగుపడింది. సాధారణ IT రిటర్న్ ఫారమ్‌లు వస్తాయి. ఇది రిటర్న్ ఫైలింగ్‌ను సులభతరం చేస్తుంది.
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్
సీనియర్ సిటిజన్స్‌లో పొదుపు పథకంలో భాగంగా డిపాజిట్ పరిమితి పెంచుతున్నట్లు బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రస్తుతం రూ.15లక్షల వరకూ ఉన్న పరిమితిని డబుల్ చేసి, రూ.30లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు.
ముగిసిన బడ్జెట్ ప్రసంగం
2023-24 సంవత్సరానికి గానూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ముగిసింది. ఉదయం 11 గంటలకు ఆమె బడ్జెట్ ప్రసంగం ప్రారంభించగా.. 1 గంట 26 నిమిషాల పాటు కొనసాగింది. సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది ఐదోసారి. ఇది మూడో పేపర్ లెస్ బడ్జెట్.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







