అన్ని రకాల యూఏఈ ప్రవేశ వీసాల చెల్లుబాటు.. మరో 60 రోజులు పొడిగింపు
- February 03, 2023
యూఏఈ: సందర్శకులకు వారికి జారీ చేసిన అన్ని రకాల వీసాల చెల్లుబాటును 60 రోజుల పాటు పొడిగించినట్లు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, నేషనాలిటీ, కస్టమ్స్, పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) తెలిపింది. అయితే, ఈ అవకాశం ఒకే సారికి మాత్రమే పరిమితమని పేర్కొంది. ఈ మేరకు తన స్మార్ట్ ఛానెల్‌ల ద్వారా కొత్త సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది. వీసా చెల్లుబాటును పొడిగించడానికి Dhs200, స్మార్ట్ సేవలకు Dhs100, అప్లికేషన్ ఫారమ్‌కు Dhs50, కస్టమర్లకు అందించే ఎలక్ట్రానిక్ సేవలకు Dhs50 రుసుములుగా నిర్ణయించినట్లు అథారిటీ తెలిపింది. దరఖాస్తుదారు పాస్‌పోర్ట్ మూడు నెలల కంటే తక్కువ కాలం చెల్లుబాటు కాకుండా ఉండాలని, అతను/ఆమె యూఏఈలో ఉండకూడదని అప్పుడే ప్రవేశ అనుమతిని జారీ చేస్తారని ICP వెల్లడించింది. దరఖాస్తుదారులు తమ వీసాల చెల్లుబాటును ICP వెబ్సైట్, దాని స్మార్ట్ అప్లికేషన్ ద్వారా UAE PASS లేదా వినియోగదారు పేరు ద్వారా పొడిగించుకోవచ్చని తెలిపింది.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్







