విలువైన నకిలీ కాయిన్స్ స్వాధీనం
- February 03, 2023
ముంబై: ముంబైలో రూ.9 లక్షలకు పైగా విలువైన నకిలీ నాణేలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బస్తాల్లో నకిలీ రూ.1, రూ.5, రూ.10 నాణేలు లభ్యమయ్యాయి. నకిలీ నాణేలపై సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ముంబైకి వెళ్లి సోదాలు చేశారు. మలాద్ ప్రాంతం వల్లభ్ బిల్డింగ్ మీదుగా వెళ్తున్న ఓ కారును తనిఖీ చేయగా, అందులో కొన్ని బస్తాలు కనపడ్డాయి.
వాటిని పోలీసులు తెరిచి చూడగా అందులో నాణేలు దొరికాయి. జిగ్నేశ్ గాలా అనే 42 ఏళ్ల ఓ వ్యక్తిని అరెస్టు చేశామని తెలిపారు. అతడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. మొత్తం రూ.9.46 లక్షల నకిలీ నాణేలు దొరికాయని చెప్పారు. హరియాణాలో నకిలీ నాణేల కర్మాగారం ఉందని, దానిపై దాడి చేసిన స్పెషల్ సెల్ అధికారులు అయిదుగురిని అరెస్టు చేశారని పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే ముంబైకి కారులో పెద్ద ఎత్తున నకిలీ నాణేలు వెళ్లాయని గుర్తించి అక్కడకు వెళ్లి పట్టుకున్నామని చెప్పారు. ప్రార్థనా మందిరాల వద్ద నిందితులు నకీలీ నాణేలను మార్చుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ వ్యవహారం చాలా కాలంగా కొనసాగుతోందని చెప్పారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







