సుప్రీంకోర్టుకు ఐదుగురు న్యాయమూర్తులు నియామకం!
- February 04, 2023
న్యూ ఢిల్లీ: సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల ఖాళీ పోస్టులను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన పేర్లలో త్వరలోనే ఐదుగురి పేర్లను ఎంపిక చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘంగా పెండింగ్ లో పెట్టిన వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరుపుతోంది.
శుక్రవారం ఇదే అంశంపై విచారించిన జస్టిస్ ఎస్ కే కౌల్, జస్టిస్ ఏఏస్ ఓకాతో కూడిన ధర్మాసనం ఎదుట అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి హాజరై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలిపారు. ఐదుగురు న్యాయమూర్తులను అతి త్వరలో నియమిస్తామని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేంద్రం తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇది చాలా సీరియస్ అంశమని, కేంద్ర తీవ్ర కాలయాపన చేయడం సరికాదని పేర్కొంది. న్యాయస్థానానికి అసౌకర్యం కలిగించే పని చేయరాదని సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







