యూఏఈ అరుదైన స్టాంపులను సేకరిస్తున్న ప్రవాస భారతీయుడు
- February 04, 2023
యూఏఈ: కేరళకు చెందిన అబ్దుల్ హమీద్ పైకాకు స్టాంపుల సేకరణ అభిరుచిగా మారింది. అతను ఇప్పటివరకు 10 వేల కంటే ఎక్కువగానే సేకరణలు చేశారు. అందులో యూఏఈ నాయకుల అరుదైన పాత ఫోటోలతో సహా అనేక అరుదైన సేకరణలు ఉన్నాయి. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఉమ్రా చేస్తున్న పాత ఫోటో.. అతని హోలోగ్రాఫిక్ 3డి డిజైన్ లాంటి అరుదైన చిత్రాలు అబ్దుల్ సేకరణలో ఉన్నాయి. అబ్దుల్ హమీద్ పద్దెనిమిదేళ్ల క్రితం యూఏఈకి వచ్చి స్థిరపడ్డారు. తొలుత టెలిఫోన్స్, రీఛార్జ్ కార్డ్ సేకరణను ప్రారంభించారు. ఇందులోనే కొన్ని వేలకు పైగా విభిన్న ఫోటోలను సేకరించారు. యూఏఈలో విడుదలైన 48 వేర్వేరు Dh1 నాణేలు అబ్దుల్ సేకరణలో ఉన్నాయి. వీటితోపాటు దుబాయ్-ఖతార్ కరెన్సీ నుండి ఏడు వేర్వేరు Dh 5 డినామినేషన్ నోట్లు తన సేకరణలో ఉన్నాయని అబ్దుల్ చెప్పారు. యూఏఈ, గల్ఫ్ రాష్ట్రాలకు చెందిన అరుదైన స్టాంపులను సేకరించినట్లు అబ్దుల్ తెలిపారు. తన సేకరణలలో యూనియన్ ఏర్పడటానికి ముందు ప్రతి ఎమిరేట్ అరుదైన స్టాంపులు, ఎక్స్‌పో 2020 దుబాయ్, ఎమిరేట్స్ లూనార్ మూన్ మిషన్, యూఏఈ ఆస్ట్రోనాట్స్, ఒలింపిక్స్‌లో యూఏఈ, యూఏఈ ముఖ్యమైన మైలురాళ్ళు, యూనియన్ స్ఫూర్తి వంటి ముఖ్యమైన తేదీలు, ఈవెంట్‌ల స్టాంపులు ఉన్నాయని అబ్దుల్ వివరించారు.
తాజా వార్తలు
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!
- ఓనర్ ఫోన్ నుండి నగదు చోరీ..డొమెస్టిక్ వర్కర్ కు జైలుశిక్ష..!!
- ఒమన్ లో డిజిటైలేజేషన్ ప్రాజెక్టులు వేగవంతం..!!







