నాన్ కువైటీలకు ఉద్యోగాలు: దరఖాస్తులు ఆహ్వానించిన కువైట్ విద్యాశాఖ
- February 04, 2023
కువైట్: విద్యా మంత్రిత్వ శాఖ 2023/24 విద్యా సంవత్సరానికి గాను నాన్ కువైటీల నుండి విద్యా ఉద్యోగాల కోసం దరఖాస్తుదారుల కోరింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో నిర్దిష్ట స్పెషాలిటీలలో పని చేయడానికి కళాశాల డిగ్రీలు కలిగి ఉండాలని సూచించింది. సి కళాశాల గ్రేడ్ కంటే తక్కువ ఉండకూడదని, 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేయవద్దని కోరింది. అవసరమైన స్పెషలైజేషన్‌లలో మొదటగా కువైటీలు, కువైట్ తల్లుల పిల్లలు, నివాసితులు, జీసీసీ జాతీయులకు వరుసగా నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేట్ బోధనా రంగాలలో అనుభవ ధృవీకరణ పత్రాలు అధికారిక సంస్థలచే ధృవీకరించబడిన తర్వాత మాత్రమే స్వీకరించబడతాయని పేర్కొంది. పిహెచ్‌డిలు కలిగి ఉన్నవారు కనీసం బి గ్రేడ్ కలిగి ఉండాలని, మాస్టర్స్ డిగ్రీ హోల్డర్లు కనీసం ఎ గ్రేడ్ కలిగి ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







