దుబాయ్‌లోని అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్.. Dhs410 మిలియన్లకు విక్రయం
- February 04, 2023
యూఏఈ: దుబాయ్ చరిత్రలో అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ విక్రయ ఒప్పందం జరిగింది. రికార్డు స్థాయిలో అపార్టుమెంట్ కు Dhs410 మిలియన్ ($112 మిలియన్) ధర పలికింది. దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ డేటా ప్రకారం, 3,620.45 చదరపు మీటర్ల విస్తీర్ణంలో "ద్వీపం 2" ప్రాంతంలో అభివృద్ధిలో ఉన్న బల్గారి లైట్‌హౌస్ ప్రాజెక్ట్‌లో ఉన్న ఈ అపార్ట్ మెంట్ చదరపు మీటరు ధర Dhs 113,245.59 కు అమ్ముపోయింది. రియల్ ఎస్టేట్ లావాదేవీలు 2.4 బిలియన్లను దాటాయి. షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ గార్డెన్స్ ప్రాంతంలో Dhs 23 మిలియన్ల విలువైన భూమి అమ్మకాలు జరిగాయి. ఆ తర్వాత నాద్ అల్ హమర్ ప్రాంతంలో Dhs19 మిలియన్ల విక్రయాలు జరిగాయి. అల్-హుబియా Dhs105 మిలియన్ల విలువతో 28 అమ్మకాలను నమోదు చేసింది. అల్ యాఫ్రా 1 రీజియన్ Dhs55 మిలియన్ల విలువతో 9 అమ్మకాలు, పామ్ జుమేరాలో ఒక మిలియన్ దిర్హామ్‌ల విలువైన 5 అమ్మకాలు జరిగాయి. అపార్ట్మెంట్లు, విల్లాల విక్రయాల సంఖ్య పరంగా బిజినెస్ బే ప్రాంతం అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత అల్ బార్షా, మెర్కాడ్ నిలిచాయని దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ నివేదిక స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







